బేగంపేట జనవరి 7(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఏఐసిసి సభ్యురాలు,టి పిసిసి ఉపాధ్యక్షురాలు,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా కోట నీలిమను కూకట్ పల్లి నియోజక వర్గం బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రమేష్ నీలిమని శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా కోట నీలిమ పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని సూచించారు.నీలిమను కలిసిన వారిలో చిన్న బాబు,
ఎరుకల సురేష్,కొండ కిరణ్,
దర్గా కరుణాకర్,శ్యామ్ తదితరులు ఉన్నారు.
