బేగంపేట జనవరి 7
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పి ఎం సంసద్ ఖేల్ మహోత్సవంలో విద్యార్థినిలను భాగస్వాములు చేయాలంటూ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పీజికల్ డైరెక్టర్ సుప్రియ ను సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ ఆధ్వర్యంలో బిజెపి నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఖేల్ మహోత్సవ లో నిర్వహించనున్న ఖో ఖో,కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ,టగ్ ఆఫ్ వార్ ,100 మీటర్ల పరుగు పందెం, ఇతర పోటీలు ఉంటాయని ఈ పోటీలలో విద్యార్థినిలు పాల్గొనేలా చూడాలని వారి ప్రతిభను వెలికి తీయాలని వారు కోరారు.స్పందించిన సుప్రియ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థినుల జట్లను సిద్ధం చేసి తప్పకుండా టోర్నమెంట్ లో పాల్గొనేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, విజయ్ కుమార్ ,తారకంపేట శ్రవణ్ ,బాబురావు పాల్గొన్నారు .

