బోయినపల్లి.జనవరి 8
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రభుత్వము ఇటీవల జీ హెచ్ ఎం సి డివిజన్ వార్డుల పునర్విభజన లో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన బోయిన్ పల్లి సర్కిల్ కార్యాలయాన్ని బోయినపల్లిలోనే ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఆర్ వి.కర్ణన్ ను కల్సి వినతి పత్రం అందజేశారు.
కమిషనర్ కర్ణన్ సానుకూలంగా స్పందించి మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కు ఎండార్స్ చేశారనీ ముద్దం తెలియజేశారు.

