ఎబీసీలో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు – విద్యార్థులు అల్ రౌండ్ డవలప్ మెంట్ చెందటమే నిజమైన పురోభివృద్ధి ఎంఈఓ జి సుబ్బయ్య, బ్యాంకు మెనేజర్ మహేష్ బాబు – ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ

తాళ్లూరు మండల కేంద్రంలో ఎబీసీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఎబీసీ ప్రధానోపాధ్యాయుడు’ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖాధికా జి సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మెనేజర్ మహేష్ రెడ్డిలు పాల్గొన్నారు. మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందటమే నిజమైన అవృద్ధి అని అన్నారు. చక్కగా చదివి రాణించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మెనేజర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పండుగ ప్రాముఖ్యతను చక్కగా వివరించేందుకు ఎబీసీ యాజమాన్యం మంచి కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. అభివృద్ధికి ఆర్థిక క్రమశిక్షణ చక్కగా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పండుగ ప్రాధాన్యతను తెలుసుకుని సంప్రదాయ బద్దంగా జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు పండుగ ప్రాధాన్యతను తెలిపేందుకు ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించామని చెప్పారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ది చెందేందుకు ఎబీసీ హైస్కూల్ పొత్సహిస్తుందని చెప్పారు. ముందుగా బోగి మంటలు వేసి సంక్రాంతి పాటలకు సాంప్రదాయ బద్దగా కోలాటం ఆడారు. చిన్నారులకు బోగి పండ్లతో స్నానం చేయించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించారు.
ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *