రైతన్నను రాజుగా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం – రాజముద్ర పాస్ పుస్తకం తో రైతన్న రాజు

కష్టపడి జీవనం సాగిస్తూ వుండే రైతన్నను రాజుగా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని మాధవరం గ్రామంలో మీభూమి మీహక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. గ్రామ సర్పంచ్ టి.రే ణుక అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతన్న నిత్యం భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఆభూమి ఎంతో ప్రేమ గా చూసుకుంటారన్నారు. అలాంటి రైతన్నలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తున్నదన్నారు. రాజముద్రతో పాస్ పుస్తకం ఇవ్వడంతో రైతన్నే రాజైనట్లు చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచితంగా రైతన్నలకు చెందిన భూమి హక్కుపత్రాలపై ముఖ చిత్రాలు, ఫొటోలు వుండటం, తప్పుల తడకగా వుండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం చంద్రబాబు ఆపాస్ పుస్తకాలను తొలగించటం జరిగిందన్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎవరి ముఖచిత్రం లేకుండా రాజ ముద్రతో
గిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే నం దు జరిగిన తప్పులను సరిదిద్దుతూ క్యూఆర్ కోడ్ తో
అన్ని వివరాలు భూమి గలయజమానికి తెలిసేలా సాంకేతికతతో కూడిన పాస్ బుక్ అందజేస్తుదన్నారు. ఈ పాస్ బుక్ వల్ల అక్రమాలు జరుగకుండా నిలువరించ వచ్చునన్నారు. సీఎం చం
ద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి, యువనాయకులు నారాలోకేష్ రాష్ట్రా న్నిఅభివృద్ధి పథంలోనడిపేందుకునిరంతర కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో 472 మందికి రాజముద్ర పట్టాదార్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఏ వైనా అభ్యంతరాలు వుంటే రెవెన్యూ అధికారులు వద్దకు వెలితే పరిష్కరిస్తారన్నారు. రైతులకుపట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు,మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు జి.రమణారెడ్డి, టీడీపీ నాయకులు మానం రమేష్ బాబు,జి.వే ణుబాబు,కాలేషావలి గ్రామ టీడీపీ అధ్యక్షులు సోము శ్రీను, నుసుం వెంకటేశ్వరరె డ్డి, కైపు రామకోటిరెడ్డి ,మాజీ సర్పంచ్ పాలెపోగు దాసు,రావులపల్లి శ్రీను, రాచకొండ వెంకట్రావు, పిన్నిక రమేష్, పేరిరెడ్డి, డాని, అధికారులు రీసర్వేడిప్యూటీ తహసీల్దార్ ఎం.ప్రశాంత్. ఆర్ ఐ సుధీర్ కుమార్ , పలుగ్రామాల టీడీపీ, జనసేన శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *