అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు -సంక్రాంతి పండుగ విశిష్టతను చాటిన ప్రకాశం–మార్కాపురం జిల్లాల పోలీస్ శాఖ-ఆకట్టుకున్న రంగవల్లులు… అల్లరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పోలీస్ గ్రౌండ్స్‌లో నిత్యం కవాత్‌, డ్రిల్లులు వంటి శిక్షణ కార్యక్రమాలతో ఉండే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సంక్రాంతి వేడుకలలో భాగంగా జిల్లా ఎస్పీ వి.హర్ష వర్ధన్ రాజు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల మహిళ పోలీస్ లు, వారి కుటుంబ సభ్యులతో కలసి వేడుకలలో పాల్గొన్నారు. ప్రధానంగా నిర్వహించిన ముగ్గుల పోటీలను ప్రకాశం జిల్లా ఎస్పీ సతీమతి శృతి దండు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు ఒంగోలు పిటీసి ప్రిన్సిపాల్ రాధిక ఐపీఎస్ గారు, జిల్లా కలెక్టర్ సతీమణి పి.సుజాత , ఒంగోలు ఎమ్మెల్యే సతీమణి దామచర్ల నాగసత్యలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా పోలీస్ గ్రౌండ్స్‌లో ముగ్గుల పోటీలు, గొబెమ్మలు, ఎద్దుల బండ్ల,పొట్టేల ప్రదర్శన, గంగిరెద్దుల విన్యాసాలు, పొంగలి కార్యక్రమాలు, గాలిపటాల సందడి, మ్యూజికల్ చైర్, లెమన్ & స్పూన్, పెయింటింగ్ పోటీల నిర్వహిణతో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలతో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సందడి వాతావరణం నెలకొంది. సంప్రదాయ బద్దంగా కార్యక్రమాలు నిర్వహించటంతో పోలీసులలో ఆనందం వెల్లివిరిసింది.

తెలుగువారి సంప్రదాయం, సంస్కృతి, మహిళా మూర్తుల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు రంగవాళ్లను తీర్చిదిద్దారు. వాటిని తిలకించిన అతిథులు హర్షం వ్యక్తం చేశారు. ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. అతిథులు హాజరైన వారు న్యాయ నిర్ణిత వ్యవహరించి ముగ్గుల ప్రాముఖ్యత, వాటిలోని దాగి ఉన్న అంతర్గత భావం, సందేశం ఆధారంగా విజేతలను ప్రకటించారు. ఈ ముగ్గుల పోటీలో వంద మందికి పైగా పోలీస్ కుటుంబ సభ్యులు మరియు పోలీసులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టత, తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా సుందరమైన, కళాత్మకమైన రంగవల్లులు వేశారని, వారిలో అద్భుతమైన కళాత్మకత, సృజనాత్మకత ఉన్నాయని తమ అభిప్రాయాలు
వ్యక్తం చేశారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాత్రింబవళ్ళు శ్రమించే పోలీస్ సిబ్బందికి మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమన్నారు,విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీస్ సిబ్బందికి ఇలాంటి వేడుకలు మనస్సుకు విశ్రాంతిని కలిగిస్తాయనన్నారు.ఇలాంటి కార్యక్రమాలతో మరింత ఉత్సాహంతో సమర్థగా విధులు నిర్వర్తించగలరన్నారు. సంక్రాంతి పండుగ అనగానే ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు, పిండివంటలు, తెలుగు సంప్రదాయాలు గుర్తుకువస్తాయని, అందరూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ముందుగా జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు మరియు ప్రజలకు ముందుగా సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చక్కగా ముగ్గులు వేసి ప్రతిభ కనబరిచిన ఐదుగురి విజేతలకు జిల్లా కలెక్టర్ సతీమణి, ఎస్పీ సతీమణి ల చేతుల మీదగా బహుమతులను ప్రదానం చేయటం చేశారు. ముగ్గుల పోటిలో విజేతలు ప్రథమ బహుమతి కళ్యాణి , ద్వితీయ బహుమతి బి.సాహిత్య , తృతీయ బహుమతి బి.నాగలక్ష్మి , చతుర్ధ బహుమతి టి.నాగవేణి , పంచమ బహుమతి షన్ను గెలుపొందారు. అదే విధంగా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మరియు పిల్లలకు మ్యూజికల్ చైర్, లెమన్ & స్పూన్, పెయింటింగ్ పోటీలలో విజేతలగా నిలిచినా వారికి నిర్వహించగా బహుమతులను ప్రధానం చేయటం జరిగింది.

ఈ ముగ్గుల పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ఎస్పీ సతీమణి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ రమణ రెడ్డి, ఎస్సైలు, ఏఆర్ఎస్సైలు, సిబ్బంది మరియు పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *