బేగంపేట జనవరి 10
(జే ఎస్ డి ఎం న్యూస్) : ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం, ట్విన్ సిటీస్ గా విశ్వవ్యాప్తంగా పేరున్న సికింద్రాబాద్ పేరు లేకుండా కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం తీవ్రమైన అన్యాయమని , సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే పోరాటం తప్పదని కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో మైలారగడ్డ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ జిహెచ్ఎంసి పునర్విభజన పేరిట ఏకపక్షంగా సికింద్రాబాద్ పేరు లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ పేరును రూపుమాపాలనుకునే ప్రక్రియను తక్షణమే విరమించుకొని స్థానిక ప్రజల, ప్రజా సంఘాల రాజకీయాలకు పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ను కొనసాగించాలని కోరారు.
ఈ ప్రక్రియ జరిగేంతవరకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని,ఆ దిశగా జరిగే పోరాటంలో సిపిఐ పార్టీ ముందు వరసలో ఉంటుందని తెలియజేశారు.
చలో ఖమ్మం.18న జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరండి.
సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనెల 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తూ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో.సిపిఐ నాయకులు కొమురెల్లి బాబు, సోమయ్య, గౌస్ శ్రీహరి, రవి ,రమేష్, కుమార్, సంపత్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

