సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు చీరలు (సారె)పంచిన అభిషేక్ అడపా, షేక్ గౌస్ లు.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుంది…మహిళలకు సంక్రాంతి కి చీరె లిచ్చి సత్కరించడం సంతోషంగా ఉంది….సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా కోట నీలిమ.

బేగంపేట జనవరి 10 :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వంలో మహిళల పాత్ర కీలకంగా ఉందని ,ప్రతి పథకం లోనూ ముందుగా వారికే అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బేగంపేట డివిజన్ పరిధిలోని పాటి గడ్డ పైగా ప్యాలెస్ లో శనివారం సనత్ నగర్ నియోజకవర్గం మాజీ ఏ బ్లాక్ అద్యక్షులు షేక్ గౌస్ ,యువ నాయకుడు అభిషేక్ అడపా ల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ, సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ మహిళలు పండగపూట మంచి చీర ధరించి మహాలక్ష్మి లాగా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు చీరలు పంపిణీ చేసిన అభిషేక్ ,షేక్ గౌస్ లకు ప్రత్యేకంగాఅభినందనలు ,కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మహిళలదే కీలకపాత్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు సంపూర్ణ గౌరవం దక్కుతుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి తీసుకు రావడం తో పాటు గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిందన్నారు. సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్ మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో అభిషేక్ గౌస్ లు చేపట్టిన చీరల (సారే) పంపిణీ కార్యక్రమాన్ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేసి సన్నబియ్యంఅందిస్తున్నారన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళలనువిస్మరించిందన్నారు.తమ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందన్నారు. షేక్ గౌస్, అభిషేక్ లు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా డివిజన్ పరిధిలోని మహిళలకు చీరలు ఇచ్చి సత్కరించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ కోట నీలిమ మార్గదర్శకత్వంలో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను ముందు ముందు నిర్వహించనున్నట్లు తెలియజేశారు .ఈ సందర్భంగా కోట నీలిమ దీపక్ జాన్ లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్, రమాదేవి, సి రాజేందర్, సలీంఖాన్, నసీరుద్దీన్ (అడ్డు) మహేష్ యాదవ్ ,చంద్రకళ, సువర్ణ ,రాధా, భవాని, సులేఖ, బుష్రా ,భవాని ,లలిత , మునీర్ 1000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *