రెండు తెలుగు రాష్ట్రాల్లోతొలి టోటల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్‌ను ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్.

హైదరాబాద్, జనవరి 10 ,
(జే ఎస్ డి ఎం న్యూస్ )
సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి తన ల్యాబొరేటరీలో అత్యాధునిక టోటల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్
(టి ఎల్ ఏ) వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తొలి సారి అమలు చేసిన సాంకేతికతగా నిలిచింది. దీనితో కిమ్స్ హాస్పిటల్స్ ఖచ్చితమైన నిర్ధారణ, వేగవంతమైన సేవలు రోగి కి నాణ్యమైన సేవలు అందించడానికి సిద్ధమైంది.ఈ అత్యాధునిక టిఎల్‌ఏ ల్యాబొరేటరీని శనివారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ల్యాబొరేటరీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరియు మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ ల్యాబొరేటరీ మెడిసిన్ డా. రాధికా చౌదరి మరియు కన్సల్టెంట్ బయోకెమిస్ట్ డా. మహమ్మద్ మొయినుద్దీన్ మాట్లాడుతూ టోటల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్ ద్వారా మానవ జోక్యం తగ్గి, ప్రీ-అనలిటికల్ మరియు అనలిటికల్ లోపాలు తగ్గుతాయని, బయోసేఫ్టీ మెరుగవుతుందని, పరీక్షల ఫలితాలు వేగంగా అందుతాయని తెలిపారు. అంతేకాకుండా, వర్క్‌ఫ్లో పూర్తిగా సమగ్రంగా పనిచేయడం, ఆధునిక డ్రై కెమిస్ట్రీ సాంకేతికతకు మారడం వలన నాణ్యత స్థిరంగా ఉండటం, వనరుల సమర్థ వినియోగం మరియు వైద్య నిర్ణయాలు వేగంగా తీసుకోవడంసాధ్యమవుతుందని చెప్పారు. దీని ద్వారా రోగుల చికిత్స ఫలితాలు మరింత మెరుగవుతాయని పేర్కొన్నారు.ఈ టిఎల్‌ఏ వ్యవస్థ ద్వారా సాధారణ మరియు అత్యవసర పరీక్షల సమయం తగ్గడం, పరీక్ష ఫలితాల్లో స్థిరత్వం పెరగడం, రోగి భద్రత మెరుగవడం మరియు ఎక్కువ సంఖ్యలో నమూనాలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం లభిస్తాయి. ఈ ప్రారంభంతో కిమ్స్ హాస్పిటల్స్ ఆధునిక డయాగ్నోస్టిక్స్‌లో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే తన దృష్టిని ముందుకు తీసుకెళ్తోందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *