సంక్రాంతి పండుగను పురష్కరించుకుని పేకాట, కోడి పందేలతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవని తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు హెచ్చరించారు. కోడి పందేలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ప్రజల దృష్టికి వచ్చినట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, ఫోన్ నంబర్ 9121102165 ఫోన్ చెయ్యాలని కోరారు.
