బొద్దికూరపాడులో ఈనెల 12న స్నేహ సంక్రాంతి, సిల్వర్ జూబ్లి ఆత్మీయ నమ్మేళనం నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహ సంఘం తెలిపారు. 1996-97 విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుండి 2000-01 పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ తమ పాఠశాలలో కలుసుకున్న అపూర్వ నమ్మేళనంలో అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, డీఈఓ రేణుక, డిప్యూటీ డీఈఓ, యూనివర్సీటీ రిజిస్టార్ హరిబాబు అనేక మంది ప్రముఖలు హాజరు కానున్నట్లు చెప్పారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు కూడ అందజేయబడునని చెప్పారు. పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు.
ఈనెల 12న స్నేహ సంక్రాంతి – సిల్వర్ జూబ్లి ఆత్మీయ సమ్మేళనం
10
Jan