కోడిపందాలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదు… పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్ష వర్ధన్ రాజుజూద క్రీడలు వద్దు – సంప్రదాయ క్రీడలే ముద్దు – జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు తదితర ప్రాంతాల్లో కోడి పందాలు, జూదాలు మరియు గుండాట నిర్వహించడం నిషేధమని జిల్లా ఎస్పీ.హర్ష వర్ధన్ రాజు తెలిపారు. అలాగే, ఎవరైనా కోడి పందేలు ఆడినా లేదా వాటిని ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లాలో కోడి పందేలు, జూదాలను కట్టడి చేయడానికి పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోడి పందేలు, పేకాట స్థావరాలను ముందుగానే గుర్తించి డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. పోలీసు అధికారులు గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించి కోడి పందేలు మరియు ఇతర జూదాలు జరగకుండా చూడాలన్నారు. గతంలో కోడి పందేలు, జూదాల్లో పట్టుబడిన వ్యక్తులను బైండోవర్ చేయాలని సూచించారు. అలాగే, కోడి పందాలకు ఉపయోగించే కత్తులను తయారు చేసే వారు, వాటిని సరఫరా చేసే వారు, పందాలు నిర్వహించేందుకు స్థలాలు కేటాయించే వారిని గ్రామస్థాయిలో గుర్తించి, మంచి ప్రవర్తన కొరకు వారిని కూడా బైండోవర్ చేయాలని ఆదేశించారు. పండగ రోజులలో కోడి పందేలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి సంక్రాంతి పండగను జరుపుకోవాలని సూచించారు. చట్టవిరుద్ధమైన కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, సాంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలు ప్రజల్లో సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

జిల్లాలో ఎక్కడైనా కోడి పందెం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *