ప్రతిఒక్క ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతతో విద్యనందించి భావిభారత పౌరులుగానేటి విద్యార్థులను తయారు చేయాలని ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ అన్నారు శనివారం మద్దిరాలపాడులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని దీనిని సద్వినియోగం అయ్యేలా ఉపాధ్యాయులు మంచి విద్యాబోధనలను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతను చేయాలని ఆయన కోరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు అదేవిధంగా ఎన్నికల ముందు చెప్పిన విధంగా డీఎస్సీ ద్వారా వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్య ఉన్నతకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండి వారి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూనే సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా నేటి విద్యార్థులను తయారు చేసే విధంగా పాటుపడాలని వారికి తెలియజేశారు. ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ
విద్యారంగ ప్రయివేటీకరణ సమాజంలోని అట్టడుగు, బలహీన వర్గాల ప్రజల బిడ్డలను శాశ్వతంగా విద్యా సముపార్జనకు దూరం చేస్తుందన్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతిఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో నిర్వహించవలసిన పాత్రను మరువురాదన్నారు. ఏపిటియఫ్ అందించిన ఉద్యమస్ఫూర్తిని, ఉద్యమ చరిత్రను నేటితరం ఉపాధ్యాయులకు తెలియపరచి, చైతన్యపరిచే విధంగా ఈ విద్యాసదస్సును నాగులుప్పలపాడు మండలంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తొలుత ఏపిటిఎఫ్ జెండాను ఎగురవేశారు. విద్యాశాఖకు సభాధ్యక్షులుగా మండల ఎపిటిఎఫ్ అధ్యక్షులు ఈశ్వరయ్య వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారిటెంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ,ఎంపీపీ అంజమ్మ, టిడిపి సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబా, ఏ.పి టీ ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ మౌలాలి,ఏపిటిఎఫ్ నాయకులు జంపాని వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారులు రవి, ఈమని రమణయ్య (జె వి ఆర్)కమ్మ సేవా సమితి జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, మద్దిపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ ఖాజావలి, టిడిపి నాయకుల పోతినేని శ్రీనివాసరావు అధిక సంఖ్యలో ఉపాధ్యాయినీ ,ఉపాధ్యాయులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.



