తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో పేకాట శిబిరం పై తాళ్లూరు ఎస్సై మల్లికార్జున్ రావు తన సిబ్బందితో ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.14,260 స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదరులపై కేసు నమోదు చేశారు.
తాళ్లూరు లో వెంకట్రామయ్య స్వామి దేవస్థానం సమీపంలో ఏర్పాటు చేసిన కోడిపందాల బరి ని తాళ్లూరు ఎస్సై సందర్శించి దున్ని వేయించి ధ్వంసం చేశారు. ఎవరైనా సరే అనధికారికంగా కోడిపందాలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

