అ ‘ పూర్వ ‘ కలయిక – పాఠాలు చెప్పిన గురువులకు ఘన సన్మానం

ఒకప్పుడు వారందరూ ఒకే పాఠశాలలో కలిసి మెలసి చదువుకున్నారు. ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాలలో స్థిర పడి ఉన్నత స్థాయిలో స్థిర పడి ఉన్నారు. 1996-97 నుండి 2000-01 వరకు పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అందరూ కలసి స్నేహ సంక్రాంతి – నిల్వర్ జూబ్లి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా ప్రణాళిక ప్రకారం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో దర్శి, తాళ్లూరు మండలాలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్లు నిర్వహించారు. ప్రతిభ చాటిన జెడ్పీహైస్కూల్, తూర్పు వెంకటాపురం, జెడ్పీ హైస్కూల్ తూర్పు గంగవరం, చందలూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ప్రధమ,ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు ఆంధ్ర కేసరి విద్యాలయ రిజిస్టర్ హరిబాబు, ఎపీఎన్ఆర్టీసీ ఆర్ ఎం నత్యనారాయణ లు విద్యార్థులకు బహుమతులు అందించారు. పూర్వ విద్యార్థులలో ఉన్నత స్థాయిలో ఉ న్న వారి సహకారంతో ఎపీ క్రియోటివ్ అండ్ కల్చరర్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస కళా నృత్యం, కూడిపూడి నృత్యం, హైదరా బాద్కు చెదిన ద్విపా ఆకాడమి కళాకారుల పేర్ని నృత్యం, విజయవాడ కు చెందిన వాగ్దేవి కూడిపూడి విద్యాలయ అకాడమికి చెందిన నప్ప శివ కుమారి శిష్య బృందం చే కనులు పండువగా నృత్యాలు నిర్వహించారు. పూర్వ గురువులను ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *