సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, శ్రీ జాన్సన్, కళావతి, విజయజ్యోతిలు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో మరియు రెవెన్యూ క్లినిక్ లో అందిన ఆర్జీలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 221 వినతులు రాగా అందులో రెవెన్యూ సంబంధిత అంశాలపై 125 వినతులు రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నేనుకొనుగోలుచేసిన పొలంకు ఆన్లైన్ చేయండి… లేకుంటే పురుగుల మందు తాగి చనిపోతా -రెవెన్యూ క్లినిక్ లో తాళ్లూరు మహిళ ఆందోళన
అగ్రిమెంట్ మీద డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి సాగు చేసుకుంటుండగా తాళ్లూరు
లోని కొందరు దౌర్జన్యంగా తమను బయటకు నెట్టి సాగు చేసుకుంటున్నారని, నా భూమిని నాకు ఇచ్చి ఆన్లైన్ చేయకుంటే పురుగుల మందు త్రాగి చనిపోతానంటూ తాళ్లూరు గ్రామానికి చెందిన మహిళ మాకాని నారాయణమ్మ సోమవారం ఒంగోలు లో జరిగిన రెవెన్యూ క్లినిక్ లో ఆందోళనకు దిగింది. తమకుటుంబం
గ్రామంలో ఒకరి వద్ద డబ్బులు చెల్లించి భూమి కొనుగోలు చేశామని, అందుకు. అగ్రిమెంట్ క్కూడా రాసి ఇచ్చారన్నారు. 2017లో తమ సాగులో వున్న భూమిని స్వాధీనం చేసుకుని దౌర్జన్యంగా బయటికి పంపారన్నారు. తమ వద్ద అందుకు సం బందించిన కాగితాలు వున్నాయని, అప్పటినుండి తహసీల్దార్,ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి తమకున్యాయం చేయమని కోరినా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తూ ఇతరుల వద్ద డబ్బులు అప్పుగా తీసుకుని భూమి కొనుగోలు చేయటం జరిగిందని, తమను దౌర్జన్యంగా భూమిలో నుండి బయటకు పంపి స్వాధీనం చేసుకున్నారన్నారు. గతమూడు పర్యాయాలుగా గ్రీవెన్ సెల్ కి వెళ్లి అర్జీ ఇచ్చినా అధికారులు స్పందించటం లేదన్నారు. నాభూమి
నాకు ఇవ్వకుంటే పురుగుల మందు త్రాగి చనిపోతానని ఆందోళనకు దిగింది..రెవెన్యూ క్లినిక్ లో అర్జీలు స్వీకరిస్తున్న తాళ్లూరు తహసీల్దార్ బి.వి.రమణారావు ఆమహిళతో మాట్లాడారు. పూర్తి విచారణ చేపట్టి తగు చర్యలు చేపడతానని హామీ ఇవ్వటంతో నారయణమ్మ ఆందోళన విరమించారు.

