కొత్తపట్నంమండలం, ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూములను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎయిర్ పోర్టు అధారిటీ నుండి వచ్చిన టెక్నికల్ టీమ్ సభ్యులు ఆయుషి రాయ్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు, విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూముల వివరాలను సంబంధిత మ్యాప్ ల ద్వారా టెక్నికల్ సభ్యులకు వివరించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ శాఖల ఎస్.ఈలు అశోక్ కుమార్, వరలక్ష్మి, ల్యాండ్ సర్వ్ డిడి గౌసే బాషా, మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

