ప్రకాశం జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్లను విలీనం ప్రక్రియలో భాగంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సంబంధిత పోలీస్ స్టేషన్లను సందర్శించారు.
పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును, కేసుల నమోదు, ప్రజలకు అందుతున్న సేవలు, శాంతి భద్రతలను క్షేత్ర స్థాయిలో పోలీస్ స్టేషన్ లను సోమవారం జిల్లా ఎస్పీ సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని,గదులను, రిసెప్షన్ కౌంటర్, పాత పోలీస్ క్వార్టర్స్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, పలు సిడి ఫైల్స్ ను మరియు జనరల్ డైరీ తదితర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే పిర్యదుదారులకు పరిష్కారం అందించాలని, మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మహిళలు/చిన్నారులపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. చెడు నడతకలిగిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.
రోడ్డు భద్రత లో భాగంగా గో స్లో పేరుతో జాతీయ రహదారి లో ఇసుక నింపిన డ్రమ్స్ ను పరిశీలించారు. డ్రమ్స్ పై సైబర్ నేరాల పై అవగాహన కల్పించడంతోపాటు సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలను నడపరాదు అంటూ వాటి పై వ్రాయించాలని సిబ్బంది కి సూచించారు.
ప్రతి గ్రామంలో ప్రజలకు సిసి కెమెరాల పట్ల అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పండుగలు, ఉత్సవాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్టేషన్ల విలీనంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పోలీస్ సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన, కేసుల దర్యాప్తులో నాణ్యత, రికార్డుల నిర్వహణలో స్పష్టత ఉండాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండి, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ వెంట దర్శి సబ్ డివిజన్ డిఎస్పీ లక్ష్మి నారాయణ , ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు , డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్ , అద్దంకి రూరల్ సీఐ మల్లిఖార్జనరావు ఎస్ ఐ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.




