జేసీఐ ఒంగోలు సంస్థ అధ్యక్షులు శబరీనాధ్ పి. నాయర్ అధ్యక్షతన, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న యువ వ్యక్తిత్వాలకు యూత్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది.
చార్టర్డ్ అకౌంటెంట్ నారపరెడ్డి చైతన్య రెడ్డి , బెతూన్ హాస్పిటల్ డాక్టర్ తరిగోపుల స్వాతి , చార్టెడ్ అకౌంటెంట్ దుడ్డు సౌమ్య , ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ ఎస్కే రహమాన్ యూత్ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మేడా శ్రీనివాస రావు హాజరై, యువత సమాజాభివృద్ధిలో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకలో జోన్ వైస్ ప్రెసిడెంట్ హెచ్జీఎఫ్ కె వరుణ్ కుమార్, సెక్రటరీ వీరబ్రహ్మం, ట్రెజరర్ జనసేవ శ్రీనివాస రావు పాల్గొన్నారు. అలాగే జే సి ఐ ఒంగోలు గవర్నింగ్ బోర్డ్ సభ్యులు సాత్విక్, విష్ణు, ఆఖిల్, శివ కోటి రెడ్డి, వంశీ కృష్ణ నూనె, నాగార్జున రెడ్డి తదితర సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
యువతలో నాయకత్వ లక్షణాలు, సేవా భావన పెంపొందించడమే లక్ష్యంగా జేసీఐ ఒంగోలు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.



