పండుగలు మన సంస్కృతి,సాంప్రదాయాలను చాటి చెప్పేవి…..ఎమ్మెల్యే తలసాని…

బేగంపేట జనవరి 13
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద అమీర్ పేట కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కైట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, రామ్ నివాస్ బన్సాల్, ఖలీల్, పీయూష్ గుప్తా, రాజేష్ ముదిరాజ్, గోపిలాల్ చౌహన్, గులాబ్ సింగ్, కట్టా బలరాం, జమీర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

క్యాలెండర్ ఆవిష్కరణ.
పద్మారావు నగర్ కు చెందిన బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు మహేందర్ గౌడ్, శైలేందర్, ప్రేమ్, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, రవి, హరిచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *