తలసాని ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలి.మహంకాళి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.

బేగంపేట జనవరి 13
(జె ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వెంటనే ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలంటూ రాంగోపాల్పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తలసానిపై కేసు నమోదు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు మహంకాళి ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ ఆదేశాల మేరకు తలసానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మనోజ్ తెలియజేశారు.తలసానిపై పిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు మాణిక్యాం ప్రభు , రాజ్ కుమార్ , శీలం జయ, ఎల్లేష్ , జయకృష్ణ , రఘు యాదవ్ , సాదిక్ , హేమంత్ , ఎస్ఆర్ శివకుమార్ , వెంకటేష్ , పండు గౌడ్, సునీల్ , శ్రీనివాస్ , నారాయణ , జగదీష్ , తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *