కాకినాడ జనవరి 13
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కాకినాడ బార్ అసోసియేషన్ లో సంక్రాంతినీ పురస్కరించుకుని మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు.న్యాయ నిర్ణేతలుగా కాకినాడ జిల్లా మహిళా న్యాయమూర్తులు వి.సాహితీ, ఏ నాగమల్లేశ్వరి, ఎస్.కె షరీన్ వ్యవహరించారు. మహిళలు వేసిన రంగు రంగుల ముగ్గులను గమనించి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి పుట్ట మహాలక్ష్మి, రెండవ బహుమతి గీతిక అండ్ టీం, మూడో బహుమతి సునీత అండ్ టీం దక్కించుకున్నారు.. వీరందరికీ కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం , జిల్లా మహిళ న్యాయమూర్తులు చేతుల మీదుగా బహుమతులు విజేతలకు అందజేశారు. మంగళవారం ఉదయం
నుంచి కమిటీ సభ్యులు దగ్గరుండి ముగ్గుల పోటీలు నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు.



