సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శుభాకాంక్షలు తెలియజేసారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధు మిత్రులు అందరిని కలుసుకుని కనువిందులు చేసే అందరి పండుగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంటలు చేతికి వచ్చే కాలం అని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకుని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి, సంక్షేమంలో ప్రకాశం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా సమిష్టి కృషిచేద్దామని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు. .
