తెలుగు పండుగలు ఎంతో గొప్పవి…..సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట జనవరి 14 , (జే ఎస్ డి న్యూస్) :
తెలుగు పండుగలు ఎంతో గొప్పవని, వాటి విశిష్టత నేటితరం పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు మనవరాలు, పార్టీ నాయకులు, మిత్రులతో కలిసి పతంగులను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి వచ్చిన తర్వాత మన పండుగలు జరుపుకోవడం పట్ల శ్రద్ధ చూపడం లేదని విచారం వ్యక్తం చేశారు. పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పుతాయని అన్నారు. తల్లిదండ్రులు మన పండుగల ప్రత్యేకత, విశిష్టత గురించి మీ మీ పిల్లలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, యాదవ సంఘం నాయకులు చిన శ్రీశైలం యాదవ్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ముఠా జయసింహ, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీపతి, సాదం బాల్ రాజ్ యాదవ్, మహేష్ కుమార్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కిషోర్ కుమార్, శ్రీహరి, రామ్ నివాస్ బన్సాల్, శేఖర్, ప్రేమ్, ఆనంద్ పాటిల్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *