బేగంపేట ఏఎండి, ఆర్బిఐ నివాసాల ముందు ఫుట్ పాత్ లపై డబ్బాలు తొలగించండి .బేగంపేట కమ్యూనిటీ పోలీస్ గ్రూపులో పోస్ట్ లు.దశాబ్దాలుగా ఇదే దుస్థితి డబ్బాలు ఏర్పాటు చేసి కిరాయిలు వసూలు చేస్తున్న ముఠా.శ్యామ్ లాల్ బిల్డింగులో రాకపోకలకు తీవ్ర అంతరాయగా మారిన ఫుట్ పాత్ కబ్జాలు.

బేగంపేట జనవరి 14
(జే ఎస్ డి ఎం న్యూస్)
నగరంలో పాదచారుల కోసం నిర్మించిన ఫుట్ పాత్ లు కబ్జాలకు గురయ్యాయి. ఈ విషయాన్ని స్థానికులు పాదచారులు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి ఏటా లక్షల రూపాయలు వెచ్చించి ఫుట్ పాత్ లను ఆధునికరిస్తున్న అవి కబ్జాలకు గురి కావడంతో ప్రభుత్వ ధనం నిరుపయోగంగా మారుతుంది. బస్సుల కోసం వేచి ఉండేందుకు ప్రయాణికుల కోసం నిర్మించిన బస్సు షెల్టర్లు సైతం ఆక్రమణలకు గురయ్యాయి అంటే నగరంలో కబ్జారాయుళ్ల పరిస్థితి ఎలా ఉందన్నది స్పష్టం అవుతుంది. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ఫుట్ పాత్ కబ్జాలకు గురికావడంతో పాదచారులు ప్రధాన రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. పార్కులు, బస్సు షెల్టర్లు ప్రధాన రోడ్ల వెంట ఉన్న ఫుట్ పాత్ లు నగరం మొత్తం ఇలాగే కబ్జాలకు గురయ్యాయి. ముఖ్యంగా బేగంపేట్ డివిజన్ పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ ఏ ఎండి ,ఆర్బిఐ నివాసాల ముందు ఫుట్ పాత్ లపై డబ్బాలు తొలగించండి ,ఈ మార్గంలో ట్రాఫిక్ జామును నివారించండి .అంటూ బేగంపేట కమ్యూనిటీ పోలీస్ గ్రూపులో పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఇదే దుస్థితి నెలకొని ఉంది. కొందరు ఫుట్ పాత్ ను ఆక్రమించే డబ్బాలు ఏర్పాటు చేసి ,అడ్వాన్సు వసూలు చేయడంతో పాటు ప్రతినెల కిరాయిలు వసూలు చేస్తున్నారు .దర్జాగా ఫుట్ పాత్ కబ్జా చేసిన సంబంధిత జిహెచ్ఎంసి ,ట్రాఫిక్ ,లాండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి .బేగంపేట నుంచి ఫతేనగర్ బాలానగర్, కూకట్పల్లి ,బోయిన్ పల్లి ప్రాంతాలకు వెళ్లే మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలతో ఈ రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుంది. కొందరు ఫుడ్ పాత్ లపై డబ్బాలు ఏర్పాటు చేసి వాటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి సైతం కిరాయికి ఇస్తున్నారంటే డబ్బాల కబ్జారాయుల దందా ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్ట మవుతుంది.శ్యామ్ లాల్ బిల్డింగ్ ఆర్బిఐ నివాసాలతో పాటు తాత చారి కాలనీ పార్కు చుట్టూ ఉన్న ఫుట్ పాత్ ను కూడా కబ్జా చేసి కిరాయికి ఇస్తున్నారు. ఇటీవల పార్కు వద్ద ఓ డబ్బాలో అగ్ని ప్రమాదం సైతం సంభవించింది. శ్యామలాల్ బిల్డింగ్ మ్యాజిస్టిక్ మెన్షన్ ,ఎయిర్పోర్ట్ నివాసాలు, అల్లావుద్దీన్ బిల్డింగ్ ,షాపర్స్ స్టాప్ పక్కన, నల్లి సిల్క్ గల్లి, రంగమణి ఆసుపత్రి పక్కన ఫుట్ పాత్ లు మొత్తం కబ్జా చేసిన కబ్జా చేసిన. కబ్జా రాయుళ్లు నెలల్లో కిరాయిలు వసూలు చేస్తున్నారు. మరికొందరైతే డబ్బాలను ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అమ్ముకుంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి దోస్తులతో కలిసి మద్యం సేవించేందుకు ఓ డబ్బా ఏర్పాటు చేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది.ఇక్కడ వ్యాపారులకు వద్దకు వచ్చే వారు వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయగా మారింది.
ఇదే విషయాన్ని ఇటీవల కొందరు కమ్యూనిటీ పోలీసు బేగంపేట గ్రూపులో ఫోటోలతో సహా పోస్ట్ చేశారు. ఇదే ప్రాంతంలో ఉన్న వైన్ షాపుల వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందనీ స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .శ్యామ్ లాల్ మహాపరి నిర్వాణ (స్మశాన వాటికి) వద్ద రోడ్డు ఆక్రమించి వివిధ ప్రాంతాలకు చెందిన వాహనాలు నెలలపాటు ఇక్కడే పార్కింగ్ చేసి వదిలి వేస్తున్నారు.ఇదే మార్గంలో కొందరు మాంసాహార వ్యర్ధాలను పడవేస్తుండటంతో పక్షులు అధిక సంఖ్యలో వస్తున్నాయి .సమీపంలో బేగంపేట విమానాశ్రయం రన్వేపై విమానాల లాండింగ్ హెలికాప్టర్లు, ట్రైని విమానాల లాండింగ్ సమయంలో ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది , ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కబ్జాలను తొలగించి ట్రాఫిక్ యధావిధిగా సాగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిహెచ్ఎంసి అధికారులు సహకరిస్తే పూర్తి స్థాయిలో ఫుట్పాత్ కబ్జాలు తొలగిస్తాం నార్త్ జోన్ టాపిక్ వన్ ఏసిపి జి. శంకర్రాజు.
జిహెచ్ఎంసి అధికారులు సహకరిస్తే నార్త్ జోన్ పరిధిలోని ఫుట్ పాత్ కబ్జాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు ట్రాఫిక్ యంత్రంగా సిద్ధంగా ఉందని నార్త్ జోన్ ట్రాఫిక్ వన్ ఎసిపి జి. శంకర్రాజు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *