తాళ్లూరు మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన జీఆర్ పీ కానిస్టేబుల్ ఏటి శ్రీనివాస రావు (50) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో ఆయన మృత దేహాన్ని స్వ గ్రామం మాధవరం తీసుకువచ్చి పోలీసు లాంఛనాలతో అత్య క్రియలు నిర్వహించారు. సీఐ షేక్ మౌళాలి షరీఫ్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం మూడు రౌండ్లు గాలిలోనికి కాల్పులు జరిపి ఘన నివాళులు అర్పించారు. 1998వ సంవత్సరంలో జి ఆర్ పి పోలీసుగా విధులలో చేరిన శ్రీనివాసరావు పీటీసీ ట్రైనింగ్ సెంటర్లో, జిఆర్పీ పోలీస్ గా విధులు నిర్వహించారు. ఆయనకి భార్య ఇరువురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు .వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసేవారని ఆయన సేవలు కొనియాడారు. స్థానిక నాయకులు మాజీ ఎంపీటీసీ కొండలు, పిన్నిక రమేష్, డాని మీరా మెహినుద్దీన్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

