కూటమి ప్రభుత్వం – అభివృద్ధి ప్రభుత్వం -దర్శి లో కూటమి తిరిగి జెండా ఎగరాలి అభివృద్ధి ఉరుకులు తీయాలి -మంత్రులు డాక్టర్ డోలా, గొట్టిపాటి, ఎంపీ మాగుంట, పార్టీ ప్రెసిడెంట్ ఉగ్ర, దామచర్ల , గొట్టిపాటి లక్ష్మీ తదితర నేతల ధీమా వ్యక్తం

దర్శి నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి , గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి , సీనియర్ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, విజయ్ కుమార్, అశోక్ రెడ్డి , యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ ఏరిక్షిన్ బాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు ,టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి- సుబ్బారావు ,దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ,నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథులైన వ్యక్తులు మాట్లాడుతూ..
దర్శిలో తెలుగుదేశం జెండా ఎగరాలని తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. గత ఐదేళ్లు వైసిపి లో దర్శి అనకబడిందని అభివృద్ధికి దూరమైందని వారు విమర్శించారు. మన 18 నెలలకూటమిపాలనలో టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి సారధ్యంలో ప్రజా పాలన అభివృద్ధి పాలన నడుస్తుందని వారి అభివర్ణించారు.
ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ స్వల్ప తేడాతో సాంకేతికంగా మన డాక్టర్ లక్ష్మీ ఓటమి చెందినప్పటికీ ప్రజానేతగా గెలిచారని ప్రజల హృదయాలు గెలుచుకుంటున్నారని అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్నారని అందులో భాగంగానే నేడు సబ్ స్టేషన్, డివిజన్ కార్యాలయాల శంకుస్థాపన చేపట్టారని ఆయన ప్రశంసించారు. అభివృద్ధి చూసి తిరిగి అభివృద్ధి దర్శికి రావాలంటే తెలుగుదేశం జెండా మళ్లీ ఎగరవేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరూరా తెలుగుదేశం గెలవాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గెలిచిన వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల పట్టించుకోరు నియోజకవర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోరు అని స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గురించి పరోక్షంగా విమర్శ చేశారు. ఓడిపోయినప్పటికీ ప్రజల హృదయాలు గెలిచిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్సన్ బాబు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ 18 నెలల కాలంలో అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్నారని ఆయన వివరించారు. మన కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ అభివృద్ధి ద్వేయంగా పాలన నడుస్తుందని ఆయన వివరించారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా మన ప్రభుత్వం పాలన సాగిస్తుందని అందులో భాగంగానే దర్శి నియోజకవర్గంలో విద్యుత్తు డివిజన్ కార్యాలయం, విద్యుత్ సబ్ స్టేషన్ ఆరు నెలల్లో ప్రజలకు అంకితం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షల కనుగుణంగా పాలన సాగిస్తున్నామని దర్శి నియోజకవర్గంలో ప్రజల కోసం దర్శి అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న డాక్టర్ లక్ష్మికి ప్రజలందరూ అండదండగా ఉండి ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దర్శిని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చేపట్టిందని అందుకు ఎంపీగా తగిన నిధులు మంజూరు చేసి డాక్టర్ లక్ష్మికి అండదండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ శాసనసభ్యులు దామరచర్ల జనార్దన్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా మన కూటమి పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళవలె ప్రజా జన రంజక పాలన సాగిస్తున్నారని ప్రజలందరూ ఆదరించాలని అభిమానించాలని కోరారు.
దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వంలో దర్శికి మహర్దశ
విర జిమ్ముతున్న అభివృద్ధి వెలుగులు:
మన 18 నెలల కూటమి ప్రజా పాలనలో ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంగా అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్నామన్నారు.
ఇక దర్శిలో విద్యుత్ వెలుగులు వికసిస్తాయన్నారు.
మా బాబాయి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ మంత్రిగా ఉన్న ఈ సమయంలో గొట్టిపాటి వారసురాలుగా దర్శి ప్రాంత ప్రజల ప్రతినిధిగా విద్యుత్తు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసుకోవడం, డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం, సోలార్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడం ఇలా అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్నామని ఎంతో ఆనందంగా ఉందని ఆమె వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి , గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి , జిల్లా పార్టీ నూతన రథసారథి ఉగ్ర నరసింహారెడ్డి ఇలా అనేక మంది పెద్దలు సంపూర్ణ సహకారంతో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ఆమె వివరించారు.
సంక్రాంతి పండుగ రోజుల్లో దర్శిలో సరికొత్త సంక్రాంతిని చూస్తున్నామన్నారు.
గత ఐదేళ్లు వైసిపి విధ్వంసకర పాలనలో గ్రూపు తగాదాలు, కులాల తగాదాలుతో అభివృద్ధి లేని దర్శిని చూశారు.
కానీ ఈ 18 నెలల కూటమిపాలనలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తూ ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో, ఆనందంతో అభివృద్ధి దర్శిలో చూస్తున్నారు.
మన అధినేతలను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి ఎజెండాగా కులమతాలకతీతంగా కేవలం ఎన్నికల వరకే రాజకీయాలంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో దర్శిని అభివృద్ధి దర్శిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో నా అడుగులు ఉన్నాయి.
అందుకు సంపూర్ణ సహకారం మన పెద్దలు అందిస్తున్నారు.
ఇప్పటికే తాళ్లూరులో 20 కోట్లతో 132/33 కెవి సబ్ స్టేషన్ ను పూర్తి చేసుకున్నాం.
కురిచేడులో నాలుగు కోట్లతో 33/11 సబ్స్టేషన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
ఇప్పుడు కొత్తగా ఉల్లగళ్లు లో సబ్ స్టేషన్,
దర్శి లో విద్యుత్తు డివిజన్ కార్యాలయం…
ఇలా విద్యుత్ వికసిత దర్శి గా తీర్చిదిద్దుకోగలుగుతున్నాం.
ఇక లోవోల్టేజి సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చిందన్నారు.
ఇక విద్యుత్ కోతలు ఉండవని రైతులకు విద్యుత్ సమస్య తొలగిపోతుందని ఆమె ఆనంద వ్యక్తం చేశారు.
ఏ ప్రభుత్వంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘన చరిత్ర లేదని…
అది మన కూటమి ప్రభుత్వంలో గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రిగా సాధ్యమైందని ఆమె వివరించారు.
అదేవిధంగా వెనుకబడిన దొనకొండ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చే దిశగా సోలార్ ప్రాజెక్టు కూడా త్వరలో రానుంది.
అదేవిధంగా ఆయుధాల తయారీ యంత్రాలు కూడా తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. వలసలు నివారించే దిశగా ఉపాధి లక్ష్యంగా దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని డాక్టర్ లక్ష్మీ వివరించారు.
నగర పంచాయతీగా ఉన్న దర్శి పట్టణాన్ని థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోగలిగామని, ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్లు, డ్రైన్లు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చక చకా పూర్తి చేసుకోగలుగుతున్నాం.
అదేవిధంగా తాగునీటి శాశ్వత అవసరాలు తీర్చే అమృత పథకం త్వరలో రాబోతుంది.
టీటీడీ కళ్యాణమండపం గత వైసిపి ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురై దాతలు విరాళాలను తీసుకొని పట్టించుకోకపోగా…
మన ప్రభుత్వం వచ్చాక తిరిగి గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో టీటీడీ నిర్మాణాన్ని చేపట్టాం.
త్వరలో డిగ్రీ కాలేజీ నిర్మాణం,మినీ స్టేడియం నిర్మాణం,ఆర్టీసీ డిపో నిర్మాణం.. ఇలా నియోజకవర్గ కేంద్రమైన దర్శి రూపురేఖలు మార్చే దిశగా మన కూటమి పాలనలో ప్రజా పాలన నడుస్తుంది.
ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ప్రజల కష్టాలను తీర్చే లక్ష్యంగా మనం ముందుకు వెళుతున్నాం.
మన కూటమిపాలనలో క్రమం తప్పకుండా….పెన్షన్లు ఇవ్వడం, రైతాంగాన్ని ఆదుకోవడం,తల్లికి వందనం పథకం,ఉచిత బస్సు సర్వీసులు
అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మనం ముందుకు వెళుతున్నామన్నారు.రాబోయే మరో 20 ఏళ్లు కూటమి పాలన కొనసాగే విధంగా ప్రజల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా, స్వర్ణాంధ దిశగా అడుగులు వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు సాగిస్తున్న మన మంచి ప్రభుత్వాన్ని ఆదరిద్దాం, అభిమానిద్దాం.తిరిగి దర్శిలో తెలుగుదేశం జెండా ఎగిరే దాకా అందరం కలిసి పని చేద్దామని డాక్టర్లకు గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, పిడతల నెమిలయ్య, మారెళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వరరెడ్డి, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, బిజెపి నాయకులు మాడపాకుకుల శ్రీనివాసరావు, తిండి నారాయణ రెడ్డి, బిజెపి నాయకులు పుప్పాల రామారావు, తోట రామారావు, ఉల్లి బ్రాహ్మయ్య, వెంకట శేషయ్య, కుటలా ప్రసాద్, నియోజకవర్గం లోని వివిద హోదాలలో ఉన్న టిడిపి నాయకులు, తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *