మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ గా నియమితులైన శ్రీనివాసులు ను మార్కాపురం కలెక్టరేట్లో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు, మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, తహసిల్దార్ కే చిరంజీవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎం వెంకటరెడ్డి. పలువురు రెవెన్యూ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు .



