అమర జ్యోతి ర్యాలీని ప్రారంభించిన నందమూరి రామకృష్ణ…………………30వ వర్ధంతి సందర్భంగా రసూల్ పురా జంక్షన్ లో ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన నందమూరి రామకృష్ణ ,సుహాసిని, శ్రీ పతి తదితరులు.

బేగంపేట జనవరి 18 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
మాజీ ముఖ్యమంత్రి,దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు రసూల్ పురా జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు.అఖిల భారత ఎన్ టి ఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర్ అప్పట్లో అమర జ్యోతి ర్యాలీని ప్రారంభించారు.అప్పటి నుంచి ఎన్ టి ఆర్ వర్ధంతి కి రసూల్ పురా జంక్షన్ నుంచి శ్రీపతి రాజేశ్వర్ తనయుడు అఖిల భారత ఎన్ టి ఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ అమరజ్యోతి ర్యాలీని నిర్వహిస్తున్నారు.ఆదివారం 30వ వర్ధంతి సందర్భంగా ఈ ర్యాలీని నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు.ర్యాలీ ఎన్ టి ఆర్ ఘాట్ వరకు సాగింది.ఈ సందర్భంగా రామకృష్ణ , సుహాసిని లు మాట్లాడుతూ శ్రీపతి రాజేశ్వర్ కుటుంబానికి తమ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్ టి ఆర్ నిత్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారని అన్నారు.ఈ ర్యాలీలో పొలిట్ బ్యూరో సభ్యులు ,మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు,అరవింద్ కుమార్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ,చిలువేరు కాశీనాథ్ ,కానూరు జయశ్రీ,రాజేంద్ర ప్రసాద్,రాజు,బోనాల శ్రీనివాస్ గౌడ్,మురహరి గౌడ్,సోమలింగం,ప్రవీణ్,తిరుపతి నాయుడు,మహేందర్,సందీప్,రామ్ మోహన్ నాయుడు,సురేష్,మురళి,
సాంబ శివరావు, గిర్ని శ్రీను,రవి,పృథ్వీ రాజ్,జ్యోతి,చంద్రకళ,శోభా తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *