పేదల పెన్నిది అన్న ఎన్ టి ఆర్ అని, సంక్షేమానికి ఆధ్యుడు అని వక్తలు కొనియాడారు.
తాళ్లూరులో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరు తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తాళ్లూరు, తూర్పుగంగవరంలతో పాటు పలు గ్రామాలలో ఎన్ టిఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాళ్లూరులో ఎన్ టి ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తూర్పుగంగవరంలో చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తాళ్లూరు పీహెచ్సీలో పండ్లు పంపిణీ చేసారు. పులిహర పంపిణీ చేసారు. తూర్పుగంగవరంలో అన్నదానం నిర్వహించారు. సంవత్సరం నాటికి ఎన్టీఆర్ విగ్రహానికి తూర్పుగంగవరంలో ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. ఆయా కార్యక్రమాలలో మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివానరావు,వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ బి. ఓబుల్ రెడ్డి, మానం రమేష్ బాబు, మన్నేపల్లి, నాగంబొట్ల పాలెం సొసైటీ అధ్యక్షులు గొంది రమణా రెడ్డి (సమర), వల్లభనేని నుబ్బయ్య, డిసిబి ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, తాళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకా రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచపూడి వెంకట రావు, గొల్లపూడి వేణు బాబు, షేక్ పెద కాలేషా వలి(బడే), పాశం నూరిబాబు (పెద్దన్న), పిన్నక రమేష్, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పోలం రెడ్డి రమణా రెడ్డి, సీహెచ్ వీర నాగి రెడ్డి, నవులూరి విద్యా సాగర్, పాలం అంజి రెడ్డి, వంగపల్లి నాగేశ్వర రావు, నారిపెద్ది కళ్యాణన చక్రవర్తి, చాట్ల డాని, డీఎంసీ డైరెక్టర్లు బొడ్డు నాగేంద్ర హనుమా రెడ్డి, వలి, చిరంజీవి, ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత, రామయ్య, లక్ష్మి నారాయణ, సోము శ్రీను, సుబ్బా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


