తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన వ్యక్తి, సంక్షేమ ప్రభుత్వాలకు అధ్యుడు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం డాక్టర్ నందమూరి తారక రామారావు అని వక్తలు అన్నారు. జిల్లాలో ఎన్ టిఆర్ వర్థంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్ టిఆర్ విగ్రహాలకు, చిత్ర పటాలను నివాళులు అర్పించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పు నాయుడు పాలెంలో ఎన్ టిఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. టిడిపి కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రావు ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రక్త దాన శిబిరంను ప్రారంభించారు. అద్దంకి బస్టాండ్ లోని ఆధుకీకరించిన నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అనం రామ నారాయణ రెడ్డి, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డిలు ముఖ్యఅతిథులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి నివాశులు అర్పించారు. అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. భారీగా 12వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు మార్కేట్ కమిటీ చైర్మన్ ఆర్ వెంకట రావు, తాత ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

