ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో మంత్రులు నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రావు, సంతనూతల పాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ కుమార్, మేయర్ గంగాడ సుజాత, నాయకులు బెజవాడ సురేష్ కుమార్ రెడ్డి, అయినా బత్తిన ఘన శ్యాం తదితరులు పాల్గొన్నారు.

