హైదరాబాద్ జనవరి 20 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినీద్యం లేని ,మహిళ బిల్లును బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లోఅంగీకరించబోదనీ, మహిళా బిల్లుకు సంపూర్ణ సాధికారత లభించాలంటే బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాల్సిందేనని ,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.మంగళవారం హైదరాబాద్ బీసీ భవన్ లో బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మని మంజరి సాగర్ తో కలిపి జాజుల శ్రీనివాస్ గౌడ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా బిల్లు వలన గత 80సంవత్సరాలుగా పరిపాలిస్తున్న అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన పురుషులే రాజకీయ ఆధిపత్యం చేస్తున్నారని, మహిళా బిల్లు నెరవేరితే అగ్రకులాల స్థానాలలో అగ్రకుల మహిళలు వారి కుటుంబ వారసత్వానికి సంబంధించిన మహిళలు మాత్రమే మహిళా బిల్లు వల్ల ప్రయోజనం పొందుతారని, బీసీమహిళలకునామమాత్రపు రాజకీయ ప్రాతినిధ్యం కూడా దక్కదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లుతో బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తుందని, బీసీ మహిళలంతా సంఘటితంగా ఉద్యమించి మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట దక్కేవరకు పోరాడడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఈ.మని మంజరి సాగర్ మాట్లాడుతూ మహిళల స్వయం పాలన కోసం, రాజకీయ సాధికారిక కోసం ఉద్యమించే సమయం ఆసన్నమైందని, మహిళా బిల్లు లో బీసీ మహిళలకు సబ్ కోట దక్కించుకోవడానికి ఈనెల 28వ తేదీ నుండి ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చలో ఢిల్లీ చేపడుతామని ఆమె హెచ్చరించారు, బీసీ మహిళలకు సబ్ కోట పార్లెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని లేనిపక్షంలో వేలాదిమంది మహిళలతో ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, సంధ్యారాణి, శ్యామల, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్ గౌడ్, విజయలక్ష్మి, వెంకటమ్మ, శైలజ గౌడ్, నరసమ్మ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

