విద్యార్థులు చిన నాటి నుండే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర అన్నారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో బాగంగా ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్ను పరిశీలించారు. ఈ సందర్బంగా డీటీ మాట్లాడుతూ వెనక బడిన విద్యార్థులు వంద రోజుల యాక్షన్ ప్లాన్లో ఉపాధ్యాయులను ఉ పయోగించుకుని మరింత విద్యాభివృద్ధి చెందాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై వ్యక్తి గత శ్రద్ధ తీసుకుని చదివిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఉపాధ్యాయులు బ్రహ్మయ్య, కరీం, ఆంజనేయులు, సింగా రెడ్డి, పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, విఆర్మ్ చిన్ని క్రిష్ణలు పాల్గొన్నారు.
