తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ జన్మదిన వేడుకలు మంగళవారం టిడిపి అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన న్ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఒంగోలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మాగుంట, దామచర్ల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్న విషయాలను ఆయన అభిమానులకు గుర్తు చేసారు. రాబోవు తరంలో కూడ మాగుంట రాఘవ రెడ్డి కూడ దామచర్ల కుటుంబంతో అదే విధమైన సంబంధాలను కొనసాగిస్తారని అభిమానులను కరతాల ధ్వనుల మధ్య చెప్పారు.

