ఎన్ బి పాలెంలో ఆక్రమణ శ్మశాన స్థలం విడదీత

నాగంబొట్ల పాలెంలో ఆక్రమణకు గురైన స్మశాస స్థలాన్ని ఎట్టకేలకు రెవిన్యూ సిబ్బంది విడగొట్టి హద్దులు చూపారు. గ్రామ నర్వే నంబర్ 511లో 1.20 ఎకరాలు స్మశాన స్థలం ఉన్నది. ఆ ప్రాంత రైతులు కాల క్రమంలో ఆక్రమణ చేసారు. దీంతో ఆ గ్రామంలో మృత దేహాలను ఖననం చెయ్యటానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ విషయాన్ని రెవిన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు. ఇటీవల వరుసగా మూడు మరణాలు సంభవించటంతో స్థలం లేక పోవటంతో దారిలో పూడ్చవలసి వచ్చింది. దీంతో విషయాన్ని తహసీల్దార్ బివి రమణా రావు దృష్టికి తీసుకువెళ్లటంతో స్పందించిన ఆయన విఆర్తో చంధ్రశేఖర్కు ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. దీంతో బుధవారం పూర్తిగా నర్వే చేసి హద్దులు చూపారు. దీంతో గత కొంత కాలంగా ఉన్న సమస్య తొలగినట్లయినది. నర్పంచి చిమటా సుబ్బా రావు, బీసీ సెల్ నేత పన్నిక రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్య పరిష్కారానికి కృషి చేసిన తహసీల్దార్కు, రెవిన్యూ అధికారులకు, నాయకులకు ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *