ఇంటి పన్నులు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చెల్లించి రసీదు పొందాలని ఎంపీడీఓ అజిత కోరారు. మాధవరం, విఠలాపురం గ్రామాల నచివాలయాలను బుధవారం ఎంపీడీఓ అకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది ఆన్ లైన్ అటెండెన్స్ వివరాలు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వేల పురోగతిని సమీక్షించారు. ప్రతి ఉద్యోగి బయో మెట్రిక్ హాజరు వెయ్యాలని, ప్రతి నివాసానికి ఇంటి పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతను వివరించి, చెల్లించే విధంగా ప్రజలను చైతన్య వంతులను చెయ్యాలని కోరారు. గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

