వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మండలంలోని నాగంబొట్ల పాలెం గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి అధ్యక్షతన సమావేశం గ్రామపార్టీ సమావేశం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మిరెడ్డి పిచ్చి రెడ్డి, యూత్ అధ్యక్షుడిగా వంకాయల నరసింహా రెడ్డి, బీసీ అధ్యక్షుడిగా కొనికి చిరంజీవి. సోషల్ మీడియా అధ్యక్షుడిగా నవీన్, రైతు విభాగం అధ్యక్షుడిగా అంజయ్య లను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచి చిమటా సుబ్బా రావు, జిల్లా రైతు విభాగం కార్యదర్శి సంగు కొండా రెడ్డి, సోము అనిల్ కుమార్ రెడ్డి, శనివారపు శ్రీనివాస రెడ్డి, వంకాయల బాల నాగి రెడ్డి, రమణా రెడ్డి, సోము నరసింహా రెడ్డి, బాదం వెంకటేశ్వర్లు, కొమ్మి రెడ్డి రాజా, జిల్లా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొజ్జ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

