తాళ్లూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో గురువారం ఈ నారీ, సీఆర్పీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపీఎం దేవరాజ్ మాట్లాడుతూ మండలంలో 37 గ్రామ సంఘాలకు చెందిన 1175 మంది సభ్యులలో 75 మంది సీఆర్పీలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. అందులో బాగంగా మొదటి రోజు గురువారం 45 మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ – నారీలో నెలలో ఐదు రోజుల నుండి 8 రోజుల పాటు పని ఉంటుందని వారికి రోజుకు రూ. 300 గౌరవ వేతనం ఉంటుందని చెప్పారు. వీరు పొదుపు గ్రూపు సమావేశాలలో పాల్గొని పుస్తకాలు ఎలా రాయాలో సంఘంలో సభ్యురాలికి శిక్షణ శిస్తారని చెప్పారు. మన డబ్బులు – మన లెక్కలు ( ఎం డీ ఎం ఎల్) యాప్ను ప్రతి సభ్యురాలికి డౌన్ లోడ్ చేయించి వినియోగించేలా చూడాలని, ప్రతి నెల మొబైల్ బుక్ కీపింగ్ జరిగేలా సహాయ పడాలని చెప్పారు. గ్రూపులు ప్రభుత్వం ద్వారా నిర్వహించే స్కీములు, బ్యాంక్ లింకేజి, జెండర్, స్త్రీ నిధి, ఉన్నతి, జీవనోపాదులు, సంస్థాగత నిర్మాణంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఎం ఎస్ అధ్యక్షురాలు సుజాత, సీసీలు మోహనరావు, కోటేష్ బాబు లు పాల్గొన్నారు.
