రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని మోటార్ వాహన తనిఖీ అధికారి (ఎంవీఐ) రామ చంద్ర రావు అన్నారు. జాతీయ భద్రత మాసోత్సవవాలలో బాగంగా గురువారం క్విజ్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలపై జిల్లా ఉప రవాణాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి కె జయ ప్రకాశ్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు, భద్రతే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. హెల్మేట్ సీటు బెల్ట్ ప్రాధాన్యత, తప్పు డ్రైవింగ్, మద్యం సేవించి వాహన నడపటం, ట్రిపుల్ రైటింగ్, అతివేగం పై అవగాహన కల్పించారు.
