నిరంతర ఆదాయం పొందేలా ఎటీఎం మోడల్స్ – రైతు సాధికార సంస్థ ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి – ఐసీఆర్పీలకు క్షేత్ర స్థాయి పర్యటన

రైతులు నిరంతరం ఆదాయం పొందేలా ఎనీ టైమ్ మనీ (ఎటీఎం) మోడల్స్ ఎంతో ఉపయోగపడతాయని జిల్లా రైతు సాధికార సంస్థ ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి అన్నారు. ట్రైనీ ఐ సీ ఆర్ పి లకు ఐదు రోజులు శిక్షణలో బాగంగా గురువారం క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సాధికార సంస్థ ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి మాట్లాడుతూ శనగ పంటలో అంతర పంటగా ఆవాలు, ప్రొద్దుతిరుగు సాగుచేసినట్లయితే ఆకుపచ్చ పురుగు సమస్యను సహజంగా అధిగ మించవచ్చని టంగుటూరు మండల వ్యవసాయాధికారి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ రైతు ఒక పంట పై మాత్రమే ఆధార పడకుండా పలు పంటలు కలిపి సాగు చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మిడమనూరు రైతు కాకుమాని మురళీ సాగు చేసి ఏ – గ్రేడ్ శనగ క్షేత్రాన్ని సందర్శించారు. రైతు విజయలక్ష్మి పొలంలో ఐసీఆర్పీలకు ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తూ ఎటీఎం మోడల్స్ ఏర్పాటు చేయించారు. ఘన, ద్రవ జీవామృతం, బీజా మృతం ఆర్గానిక్ పొటాష్ తయారీ విధానాలపై శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయ జీపీఎం సుభాషిణితో పాటు డీపీఎం సిబ్బంది. ఎస్ పి ఎం.యు బృందం సుమాంజలి, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ విఏఏ భరత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *