ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో బంగారు పతకాలను సాధించిన మాంటిస్సోరి విద్యార్థులు

సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ పరీక్షలో మాంటిస్సోరి పాఠశాల లో చదువుతున్న విద్యార్థులు విశేష ప్రతిభను ప్రదర్శించి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.
ఈ పరీక్షలో రెండవ తరగతి చదువుతున్న గండ్రేటి సంధ్యారాణి, నాలుగవ తరగతి చదువుతున్న కంచు కుశాల్ రెడ్డి, ఉటికొండ పియూష, వాసా స్నేహ, ఐదవ తరగతి చదువుతున్న నాగినేని వెంకట గౌతమ్, జొన్నకుటి పర్ణిక రాజ్, ఆరవ తరగతి చదువుతున్న వి. కీర్తన, ఏడవ తరగతి చదువుతున్న వై. కల్పన, ఎనిమిదవ తరగతి చదువుతున్న కే. నిహారిక, టి. శ్రీరాం కౌశిక్, సాయి వెంకట హాసిని మరియు తొమ్మిదవ తరగతి చదువుతున్న పి. వినాయ్ కృష్ణ బంగారు పతకాలు సాధించారు.
బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సబరీనాథ్ , ఇషా మరియు ప్రిన్సిపాల్ నురుద్దీన్, అకాడమిక్ కోఆర్డినేటర్ సులోచన గ్లోరి అభినందించి, వారి భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *