కంటోన్మెంట్ జనవరి 23,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బ్రిటీష్ వారికి దీటుగా నిల్చి పోరాడిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు.భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నీ పురష్కరించుకొని న్యూ బోయినపల్లి నేతాజీ నగర్ లోని నేతాజీ విగ్రహానికి జంపన పూలమాలలు వేసి నివాళులు అర్పించి దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసారు. అహింసా ఆయుధంతో దేశానికి స్వాత్యంత్ర రాదని ,గాంధీజీ తో విబేందించి పోరుబాట ద్వారా నే సాధ్యమని భావించి అజాద్ హింద్ ఫోజ్ స్థాపించి బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించారనీ జంపన ప్రతాప్ అన్నారు.అనంతరం స్కూల్ విద్యార్థుల కు ఆయన నోట్ బుక్స్, బిస్కట్స్ పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో నేతాజీ అసోసియేషన్ సభ్యులు దర్శనం. నాగేష్. సుదర్శరెడ్డి. రాజు. వెంకట్. స్థానిక నాయకులు ముప్పిడి మధుకర్,సాయిబాబా యాదవ్, యాదగిరి, వర, శశి, చోటు, మౌలా,సురేష్, మధు,రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు..


