బెల్లంకొండవారి పాలెం వైసీపి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా గువ్వల సత్యనారాయణ

తాళ్లూరు మండలంలోని బెల్లంకొండ వారి పాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఆపార్టీ సీనియర్ కార్యకర్త గువ్వల సత్యనారాయణను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. బెల్లంకొండ వారి పాలెంలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో శుక్రవారం రాత్రి ఆపార్టీ మండల అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్ల పాటి మోషేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి ఆదేశాలతో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు. పార్టీ పట్ల క్రమశిక్షణతో మెలుగుతూ పార్టీ అభ్యున్నతికి చెయ్యాల్సిన కృషిని వక్తలు వివరించారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే శివన్న అండగా ఉన్నాడని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆలోకం హరిబాబు, ఎన్ బి పాలెం సర్పంచ్ చిమటా సుబ్బా రావు, జిల్లా రైతు విభాగం సెక్రటరీ సంగు కొండా రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు గువ్వల శ్రీనివాస రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్నాధం, సురేష్, గ్రామ నాయకులు కాసా గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కూలురి అంజి రెడ్డి, గువ్వల నారాయణ రెడ్డి, తిప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి. అండ్రా కేశవులు, గంగుల రాజా రెడ్డి, ఎం రవి, జయరామి రెడ్డి, శివ, భరత్ కుమార్, ప్రశాంత్, సురేంద్ర, వేణు, నారాయణ రెడ్డి, గువ్వల నాగ రాజు, యల మంద, కిట్టయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *