ప్రభుత్వ సర్వేలను సచివాలయ సిబ్బంది సక్రమంగా నిర్వహించక పోవటం పట్ల ఎంపీడీవో పి.అజిత అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని లక్కవరం, తూర్పుగంగవరం సచివాలయాలను ఎంపీడీవో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల సిబ్బంది కార్యాలయంలో లేకపోవటంతో ఆరాతీశారు. సర్వేకు వెళ్లారని చెప్పగా వారిని పిలిపించి సర్వేను పరిశీలించారు. ప్రతి ఉద్యోగికి ఇచ్చిన లక్ష్యం మేరకు చేయకుండాఎదో మొక్కుబడిగా సర్వే చేస్తున్నట్లు ఉన్నారని, ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావటం లేదని, బాధ్యతా రాహిత్యంగా వున్న సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. కొందరు సిబ్బంది. అటెండ్స్ రిజిస్టర్లలో సంతకాలు కూడా పెట్టక పోవటం, మూమెంట్ రిజిస్టర్లో ఏవిధులకు వెళ్లింది రాయక పోవటంతో తీవ్రఅసహనం వ్యక్తం చేశారు. సచివాల
ఏవిధులకు వెళ్లింది రాయక పోవటంతో తీవ్రఅసహనం వ్యక్తం చేశారు. సచివాల యాల్లో అందుబాటులో వుండరు, సర్వేలు సక్రమంగా చేయక పోతే ఎలా అనిప్రశ్నిం చారు. మార్పు రాక పోతే తగు చర్యలు తప్పవన్నారు. మండలాన్ని టాప్ టెన్ లో వుండేలా సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇంటి పన్నుల వసూళ్ల లలో కూడా నిర్లక్ష్యంగా వున్నారని, ఇంటింటికి వెళ్లి డిమాండ్ నోటీస్ అందజేసి ఇం
టిపన్నులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. తూర్పుగంగవరంలో ఇంటిపన్నులు ఇద్దరి వద్ద వసూళ్లు చేసి వారికి స్వయంగా రసీదు అందజేశారు. గ్రామం లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆవరణలో వున్న ఇసుకను త్వరి తగతిన తరలించి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుక రావాలని పంచాయతీ కార్యద ర్శిని ఆదేశించారు. కార్యాలయ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోకార్యదర్శి డి. నాగమల్లేశ్వరి, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.


