ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో మౌలిక వసతుల సమస్యలపై డిప్యూటీ మేయర్ తనిఖీ…

హైదరాబాద్, జనవరి 24 ,(జే ఎస్ డి ఎం. న్యూస్):
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్న పారిశుద్ధ్య లోపం, వీధి దీపాలు లేని పరిస్థితి, రోడ్ల దయనీయ స్థితి తదితర మౌలిక వసతుల సమస్యలపై శనివారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓయూ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) జగన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు డిప్యూటీ మేయర్‌కు వివరించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు సరైన వసతులు లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి జిహెచ్ఎంసి ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై స్పందించిన డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి, ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో అవసరమైన పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల మరమ్మతులు, రోడ్ల అభివృద్ధి వంటి పనులపై సమగ్రంగా చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని డిప్యూటీ మేయర్ భరోసా ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *