స్వచ్చ సమాజ నిర్మాణలో ప్రతి ఒక్కరూ బాగ స్వామ్యులు కావాలని వక్తలు అన్నారు.
తాళ్లూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ అజిత ఆధ్వర్యంలో నిర్వహించారు. జెడ్పీటీనీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్ది, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, యూత్ రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, నర్పంచిలు గురువా రెడ్డి, వలి, శ్రీదేవి రామయ్య, బీసీ సంఘ నేత పిన్నిక రమేష్ లు ముఖ్య అతిథులు గా పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రాముఖ్యలను వివరించారు. ప్రతిజ్ఞ చేసారు. మొక్కలు నాటారు. ఎంఈఓ జి నుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎపీఎం దేవరాజ్ కార్యదర్శి షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ వై వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. బహిరంగ మలవిసర్జన చేయరాదని తెలిపారు.



