బాలికలకు హక్కులను తెలియజేసి వారిని మరింత అభివృద్ధి పథంలో ప్రొత్సహించాల్సిన బాధ్యత అందరి పై ఉందని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య అన్నారు. వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సీ ) జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవరం ఘనంగా నిర్వహించారు . ప్రధానోపాధ్యాయుడు ఏ ఆరోన్ మిల్టన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంఈఓ సుబ్బయ్య మాట్లాడుతూ బాలికలు తమ హక్కులను తెలుసుకుని నమర్థవంతంగా ఉపయోగించుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. ప్రభుత్వం బాలికా విద్యను ప్రొత్సహించటంతో పాటు అందిస్తున్న అనేక పథకాల గురించి వివరించారు. ఉపాధ్యాయులు శ్రీనివాన రావు, శ్రావణి, శాంతి ప్రియ, నారాయణ, కానిస్టేబుల్ బ్రహ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
