తాళ్లూరు మండలంలోని మాధవరంలో పశుసంవర్థశాఖ ఆధ్వర్యంలో శనివారం పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ నర్పంచి తాటికొండ రేణుక వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 20 పశువులకు చూడిపరీక్షలు నిర్వహించి మందులు అందించారు. 42 లేగదూడలకు, 150 పెద్ద పశువులకు, వెయ్యి జీవాలకు నట్టనివారణ మందులను తాగించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలను వివరించారు. టిడిపి నాయకులు నునుం క్రిష్ణా రెడ్డి, సోము శ్రీను, ఎహెచ్ ఏ ఆంజనేయులు, గోపాల మిత్రలు పాల్గొన్నారు.
