మున్నూరు కాపుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది ఎమ్మెల్యే దానం నాగేందర్.

కంటోన్మెంట్ జనవరి 25 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మున్నూరు కాపుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రాజరాజేశ్వరి గార్డెన్ లో ఆదివారం తెలంగాణా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ . రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో మున్నూరు కాపుల ఐక్యతను చాటుతూ అత్యధిక సంఖ్యలో సర్పంచులు విజయం సాధించారని అన్నారు.వీరిలో మహిళలు కూడా ఉండటం సంతోషమన్నారు. మున్నూరు కాపుల భవనానికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని, కోరుతూ త్వరలో ముఖ్యమంత్రి ఆయన వెల్లడించారు .మున్నూరు కాపు విద్యార్థులకు సరైన వసతి గృహాలు విద్యాశాఖ సదుపాయాలు లేకపోవడంతో చాలామంది ఉన్నత విద్యకు దూరమవుతున్నరని, వారి కోసం ప్రత్యేకంగా చదువుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు దానం వెల్లడించారు. మున్నూరు కాపుల హక్కుల సాధనకై పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని అన్నారు. మున్నూరు కాపుల బలాన్ని ప్రదర్శించేందుకు త్వరలో పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని దానం స్పష్టం చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేశవరావు, వి.హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరీ ఆవిష్కరించిన అనంతరం ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సర్పంచులను మోమెంటోలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపులలో ధైర్యాన్ని నింపేందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో రాజకీయాల్లో మున్నూరు కాపులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. మున్నూరు కాపు భవనానికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కి మున్నూరు కాపు విద్యార్థులకు సరైన వసతిగృహాలు, విద్యా సదుపాయాలు లేకపోవడంతో చాలామంది ఉన్నత విద్యకు దూరమవుతున్న నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా చొరవ తీసుకునే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురానున్నట్లు వెల్లడించారు.మున్నూరు కాపుల హక్కుల సాధనకై పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల బలాన్ని ప్రదర్శించేందుకు పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల ఆనర్హత కేసు విషయమై మాట్లాడుతూ తాను పోరాటాల నుండే వచ్చిన వ్యక్తినని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు ,వి.హనుమంతరావు, ప్రకాష్ , మల్కా కొమురయ్య ,మంగళారపు లక్ష్మణ్ రాష్ట్రం లో సర్పంచులుగా విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులు మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *